పీటీ ఉష బయోపిక్‌లో కత్రినా కైఫ్‌..!


సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. ముఖ్యంగా క్రీడాకారుల జీవిత కథలతో తీస్తున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. “మేరీ కోమ్‌” “ఎమ్‌.ఎస్‌. ధోని” “దంగల్‌” వంటి చిత్రాలు ఈ కోవకు చెందినవే. అయితే పరుగుల రాణి పి.టి. ఉష బయోపిక్‌ రాబోతోందని ఇటీవల ప్రచారం జరిగింది. ఇందులో కత్రినా కైఫ్‌ నటించబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు దర్శక, నిర్మాతలు కత్రినాతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

ఈ విషయంపై కత్రినా స్పందిస్తూ.. “నేను ప్రాజెక్టుకు సంతకం చేసే వరకూ దీని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. నేను టించేందుకు కథ సరైనదైతే తప్పకుండా చేస్తా”అని అన్నారు. మరోవైపు ఫరాఖాన్‌ తర్వాతి సినిమాలోనూ కత్రినా నటించబోతున్నారని తెలిసింది. దీనికి గురించి బార్బీగర్ల్‌ను ప్రశ్నించగా.. దీని గురించి దర్శకురాలు ఫరా ఖాన్‌ను
అడగాలి. నిజంగా నాకు దీని అప్‌డేట్స్‌ తెలియవు అన్నారు. సల్మాన్‌, కత్రినా జంటగా నటించిన భారత్ సినిమా రంజాన్‌కు విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కూడా విశేషమైన కలెక్షన్స్‌ రాబడుతోంది. కత్రినా ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ హీరోగా దర్శకుడు రోహిత్‌ శెట్టి తెరకెక్కిస్తున్న సూర్యవంశీ సినిమాలో నటిస్తోంది.