కౌశల్ కూతురు బర్త్‌డే విషెస్ చెప్పిన కౌశల్‌ ఆర్మీ..నూతన్‌

తెలుగు బిగ్ బాస్ సీజన్-2 ముగింపు దశలో గ్రాండ్ ఫినాలేకి అడుగులు వేస్తున్న సమయంలో కౌశల్‌ని మిగతా ఇంటి సభ్యులు అందరు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ కలిసి కౌశల్‌పై విరుచుకుపడడంతో కౌశల్ సహించలేకపోయాడు. పైగా అతని కూతురు పుట్టినరోజు కూడా కావడంతో మరింత ఊద్వేగనికి గురయ్యాడు. నిజానికి ఈ రోజు కౌశల్ ముద్దుల కూతురు ‘తనయ’ రెండవ పుట్టినరోజు. అందుకే బయటకు వెళ్లడం కుదరదు కనుక , హౌస్ కి ఒకసారి తన కూతురిని రప్పించాలని కోరినా బిగ్ బాస్ కి వినపడలేదు. హౌస్ మేట్స్ కి వినిపించలేదు. కానీ షో చూస్తున్న ఆడియన్స్ ఇది గమనించారని చెప్పవచ్చు. కౌశల్ పడుతున్న వేదన, ఆవేదన ప్రేక్షకులు అర్ధంచేసుకున్నారు.

అందుకే కౌశల్ కూతురు పుట్టిరోజు సందర్భంగా కౌశల్ అభిమానులు పెద్దఎత్తున వాళ్ళింటికి వెళ్లి పాపకు బొకేలు,పండ్లు, కేకులు, చాకోలెట్స్ ఇచ్చి,బర్త్ డే విషెస్ చెప్పారట. ఇక కౌశల్ కి సన్నిహితుడైన నూతన్ నాయుడు కూడా ఓ పెద్ద బొకే తీసుకుని ఆ పాపకు ఇచ్చి, విషెస్ చెప్పాడు. ఇక కౌశల్ భార్య నీలిమతో నూతన్ కాసేపు మాట్లాడి, ధైర్యం చెప్పాడు.

హౌస్ లో జరిగే వాటిని పట్టించుకోవద్దని, అందరూ కల్సి ఒక్కసారిగా దాడికి దిగితే కౌశల్ ఎలా తట్టుకోగలడని, పైగా ఇదంతా ప్రేక్షకులు కూడా గమనిస్తున్నారని చెప్పుకొచ్చాడట. హౌస్ లో జరుగుతున్నది అంతా చూస్తున్న జనం మంచేదో, చెడేదో వాళ్ళే గుర్తించి,నిర్ణయం చేస్తారని నూతన్ ఈసందర్బంగా నీలిమకు వివరిస్తూ ఎలాంటి బాధ పెట్టుకోవద్దని సూచించాడు. ఎవరి బుద్ధి ఏమిటో జనం చూస్తున్నారని, కౌశల్ ఖచ్చితంగా టైటిల్ కొట్టుకుని వస్తాడని, ఎలాంటి దిగులు చెందవద్దని చెప్పాడు.