జాన్వి పొట్టి దుస్తులు వేసుకుంటోంది..అదే నా భయం.. కత్రిన సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌.. జాన్వి కపూర్ వేసుకునే దుస్తులపై కామెంట్‌ చేశారు. కత్రినా, జాన్వి ఒకే జిమ్‌కు వెళతారు. అయితే జిమ్‌కు వెళ్లేటప్పుడు జాన్వి మరీ పొట్టిగా కనిపించే షార్ట్స్‌ వేసుకుని వెళుతుంటారు. అలాంటి దుస్తుల్లో ఆమె ఫొటోగ్రాఫర్లకు పోజులిస్తూ ఉంటారు. ఆ ఫొటోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతూ ఉంటాయి.

దీని గురించి కత్రినా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘జాన్వి జిమ్‌కు మరీ చిన్నగా కనిపించే షార్ట్స్‌ వేసుకొస్తూ ఉంటుంది. ఆ విషయంలో నేను కాస్త భయపడుతుంటాను. ఇద్దరం ఒకే జిమ్‌కి వెళతాం. కలిసే వర్కవుట్లు చేస్తుంటాం. కానీ తన దుస్తుల విషయంలో మాత్రం కాస్త చింతిస్తుంటాను’ అన్నారు.

ఈ విషయం జాన్వి సోదరి సోనమ్‌ కపూర్‌ దృష్టికి వచ్చింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వి వేసుకున్న షార్ట్స్‌ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘జాన్వి రెగ్యులర్‌ దుస్తులు కూడా వేసుకుంటుంది. ఆ దుస్తుల్లో మరింత అందంగా ఉంటుంది’ అంటూ పరోక్షంగా కత్రినాకు చురకలంటించారు.