Homeతెలుగు Newsవదల బొమ్మాళి అంటున్న బాబును.. మీరే తరిమికొట్టండి

వదల బొమ్మాళి అంటున్న బాబును.. మీరే తరిమికొట్టండి

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జడ్చర్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ పోరాటం ఇంకా అయిపోలేదని.. ఇక ముందూ కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు వలసలు తగ్గాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు కూడా తిరిగి జిల్లాకు వస్తున్నారు. తెలంగాణ కల సాధించుకున్నాం. ఇప్పుడు కోటి ఎకరాల తెలంగాణ పచ్చగా చేయాలన్న కలను సాకారం చేసుకుందాం. రాష్ట్రం రానే రాదని… కానే కాదని అందరూ హేళన చేశారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏకతాటిపై నిలిచి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. పెండింగ్‌ ప్రాజెక్టుల పనులు పూర్తి చేసుకున్నాం. ప్రాజెక్టుల పనులు చేపట్టి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేశాం’

5 19

‘గత ఎన్నికల్లో గెలిస్తే రూ.1000 పింఛన్‌ ఇస్తామని చెప్పాం. అన్నమాటను నిలబెట్టుకున్నాం. ఇప్పుడు గెలిపించండి పింఛన్‌ను రూ.2వేలకు పెంచుతాం. దివ్యాంగులకు రూ.3వేలు ఇస్తాం. నిరుద్యోగ భృతిని కూడా పెంచుతాం. చంద్రబాబు ఈ జిల్లాలో కొందరిని పోటీకి పెట్టారు. ఆయన పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి ‘వదల బొమ్మాళి.. వదలా’ అంటూ రాష్ట్రంలోకి మళ్లీ వస్తున్నారు. గతంలో నా వంతు నేను ఒకసారి తరిమి కొట్టా. ఇప్పుడు ఆయన్ను తరిమికొట్టాల్సిన బాధ్యత మీదే. పాలమూరు జిల్లాను తొమ్మిది సంవత్సరాలు చంద్రబాబు దత్తత తీసుకున్నారు. ఆయన ఏం చేశారు? కానీ, ఇప్పుడు అన్ని పనులు వరుసగా జరుగుతున్నాయి. పాలమూరు ఎత్తిపోతల పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. మహాకూటమి పేరుతో మళ్లీ చంద్రబాబు మన ఇంట్లో దూరి ‘మిమ్మల్ని కొట్టి పోతా’ అంటున్నారు. రానీద్దామా? కాంగ్రెస్‌ వాళ్లు చంద్రబాబును మోసుకొస్తున్నారు. నాగం జనార్దన్‌రెడ్డి పాలమూరు ప్రాజెక్టుపై 35 కేసులు వేశారు.’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమ కాలం నుంచి తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి తన వెన్నంటే ఉండి ఎంతో పోరాటం చేశారని, ఆయన్ను గెలిపించి ప్రజలు ఆశీర్వదించాలని ప్రజలను కేసీఆర్‌ కోరారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu