HomeTelugu Trendingతరుణ్‌ భాస్కర్‌ 'కీడా కోలా' టీజర్‌

తరుణ్‌ భాస్కర్‌ ‘కీడా కోలా’ టీజర్‌

Keedaa Cola Teaser
టాలీవుడ్‌ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ స్వీయదర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘కీడా కోలా’. తాజాగా ఈ సినిమా నుండి టీజర్ విడుదలైంది. ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాల తరువాత దాదాపు ఐదేళ్ల తర్వాత తరుణ్‌ భాస్కర్‌ మళ్లీ మెగాఫోన్ పట్టుకున్నారు. ఈ టీజర్ చూస్తుంటే.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా భిన్నమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు అర్థమవుతోంది.

ఎనిమిది ప్రధాన పాత్రల చుట్టూ సాగే ఈ సినిమాలో.. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగా కీడా కోలా అనే పేరున్న కూల్‍డ్రింక్ బాటిల్ను చూపించారు. ఆ తర్వాత నటుడు బ్రహ్మానందం చైతన్య రావు తీక్షణంగా బాటిల్ లోపల ఉన్న దాన్ని చూస్తూ కనిపించారు. ‘ఏంట్రా అది’ అని బ్రహ్మానందం అడగగా.. ‘గ్రేప్స్ ఏమో’ అని అంటారు చైతన్య. ‘గ్రేప్సా.. ఎలా బతికావురా ఇన్నాళ్లు నువ్వు’ అని బ్రహ్మానందం తిరిగి డైలాగ్ చెప్పడం… ‘నువ్వు.. నువ్వు బతుకుతలేవా.. అట్లనే’ అంటారు చైతన్య.

ఆ తర్వాత కీడా కోలా కోసం మొత్తం కథ స్టోరీ తిరుగుతుందనేలా విజువల్స్ చూపించారు. ఇందులో తరుణ్ భాస్కర్ కూడా ఉన్నారు. ఆయన నెగెటివ్ క్యారెక్టర్ పోషించినట్టు అనిపిస్తుంది.’శ్వాస మీద ధ్వాస.. ఒస్తున్నాం’ అంటూ టీజర్ను ముగించారు. ఈ టీజర్‌ మొత్తం తరుణ్ భాస్కర్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని వివేక్ సుదాన్షు సాయికృష్ణ గద్వాల్ శ్రీనివాస్ కౌశిక్ నండూరి శ్రీపాద్ నందిరాజ్ ఉపేంద్ర వర్మ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ ఏడాదే చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

మెగాస్టార్‌ చిరంజీవి భోళాశంకర్‌ టీజర్‌

రామ్‌ గోపాల్‌ వర్మ వివాదస్పద చిత్రం వ్యూహం టీజర్‌

సామజవరగమ మూవీ ట్రైలర్‌

రుద్రంగి మూవీ ట్రైలర్‌

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu