HomeTelugu Trendingమహేష్‌కు జంటగా కీర్తి సురేష్‌.. పాత్ర ఇదేనా!

మహేష్‌కు జంటగా కీర్తి సురేష్‌.. పాత్ర ఇదేనా!

6 6

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా పరశురామ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట పేరుతో వస్తోన్న ఈ సినిమాను పరుశురామ్ సోషల్ మెసేజ్‌ కథతో తెరకెక్కించనున్నాడట. ఈ మూవీలో ముఖ్యంగా అవినీతికి సంబంధించిన ఓ సామాజిక అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఇక మరోవైపు సోషల్ మెసేజ్‌తో పాటు అదిరిపోయే రొమాంటిక్ సీన్స్ ఉంటాయట. అందులో భాగంగా చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా నటించనున్నాడని తెలుస్తోంది. కాగా సినిమాలో హీరోయిన్‌గా కియారాను అనుకున్నారు. అయితే ఆమె బిజీగా ఉండడంతో కీర్తి సురేష్‌‌కు చిత్రబృందం ఫిక్స్ అయ్యింది.

కీర్తి సురేష్ బ్యాంక్ ఉద్యోగి పాత్రలో కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమా కోసం కీర్తి కాస్త లావెక్కుతోందట. ఇటీవల చాలా కష్టపడి సన్నబడిన ఈ బ్యూటీ.. కొద్దిగా బరువు పెరగనుందట. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!