కోర్టును చిరు ధిక్కరిస్తాడా..?

మెగాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా విడుదలకు సిద్ధపడుతోంది. ఇటీవల టీజర్ విడుదల చేసిన చిత్రబృందం ఈ నెల 25న విజయవాడలో ఘనంగా ఆడియో విడుదల కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతుంది. ఈ వేడుకను గ్రాండ్ గా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించాలని భావిస్తున్నారు.

అయితే ఇక్కడే చిత్రబృందానికి ఓ సమస్య వచ్చి పడింది. ఆంధరప్రదేశ్ హైకోర్టు 2015లో ఇచ్చిన ఆర్డర్ ప్రకరణం ఈ స్టేడియంను కేవలం ఆటలకు సంబంధించిన కార్యక్రమాల కోసమే వినియోగించాలి. అలా కాదని ధిక్కరించిన ఎడల శిక్షకు గురవుతారు. జిల్లా కలెక్టర్ కూడా దీనికి పర్మిషన్ ఇవ్వడానికి వీలు లేదు.

అయితే ఏపి బ్యాడ్మింటన్ అసోసియేషన్ సిఈఓ పున్నయ్య చౌదరి మాత్రం 1974 నుండి సినిమా ఫంక్షన్స్ కు ఈ స్టేడియం ను వాడుతున్నామని.. అందువల్ల ఎలాంటి భయం లేదని అంటున్నారు. మరి చిరంజీవి కోర్టును ధిక్కరించి తన ఆడియో వేడుకను అక్కడే నిర్వహిస్తాడా..? లేక వేరే ఆప్షన్ ను వెతుకుతారో.. చూడాలి!