చంద్రముఖి సీక్వెల్స్‌లో కియారా అద్వానీ

టాలీవుడ్‌లో ‘భ‌ర‌త్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్‌లో మంచి విజ‌యాన్ని అందుకున్న కియారా అద్వానీ త‌న రెండో సినిమాగా విన‌య విధేయ రామ చిత్రంలో న‌టించింది. ఈ చిత్రం ఆమెకి భారీ ఫ్లాప్‌ని మూట‌గ‌ట్టుకుంది. దీంతో అమ్మ‌డికి టాలీవుడ్‌లో ఆఫ‌ర్సే క‌రువ‌య్యాయి. ఇక బాలీవుడ్‌లో రీసెంట్‌గా విడుద‌లైన క‌బీర్ సింగ్ చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్న ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం కాంచ‌న రీమేక్‌లో న‌టిస్తుంది. అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని లారెన్స్ తెర‌కెక్కిస్తున్నారు.

బాలీవుడ్‌లో కియారా మ‌రో హార‌ర్ కామెడీకి ప‌చ్చ జెండా ఊపింద‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు మేక‌ర్స్. బూల్ బులైయా 2 చిత్రంలో కియారా హీరోయిన్‌గా ఎంపికైంద‌ని టీ సిరీస్ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. బూల్ బులైయా( తెలుగులో చంద్ర‌ముఖి ) కి సీక్వెల్‌గా బూల్ బులైయా 2 అనే చిత్రం అనీస్ బ‌జ్మీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా,ఈ చిత్రాన్ని క‌బీర్ సింగ్ మేక‌ర్స్ భూషణ్ కుమార్, మూరద్ కేత‌ని, క్రిష‌న్ కుమార్ నిర్మిస్తున్నారు. కార్తీక్ ఆర్య‌న్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. జూలై 31, 2020న విడుద‌ల కానున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.