
కొరటాల శివ రైటర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసి.. సూపర్ హిట్ సినిమాలకు పనిచేశారు.అయితే ఇంత వరకూ కెరీర్ లో ఫ్లాప్ అనే మాట తెలియని దర్శకుడు కొరటాల నాలుగేండ్ల తర్వాత ఆచార్యతో మళ్లీ ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతోంది.. ప్రస్తుతం కొరటాల శివ ఈ సినిమా హడావుడిలో ఉన్నారు. ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘ఆచార్య’.. రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు మెగా అభిమానులు. . ఆచార్య తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను ఎన్టీఆర్ తో కన్ఫమ్ చేసిన విషయం తెలిసిందే.













