వెంకటేశ్‌ సరసన హాట్‌ బ్యూటీ

విక్టరి వెంకటేశ్‌, అక్కినేని నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ‘వెంకీమామ’. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా.. ఈ వారం నుంచే చిత్రీకరణ ప్రారంభం కానుంది.

అయితే.. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటిస్తుండగా, వెంకటేశ్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌ ఎంపికైనట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మొదటగా.. వెంకీతో శ్రియ నటిస్తుందని ప్రచారం సాగినా… ఆమె స్థానంలో పాయల్‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. పాయల్ ‘RX100’ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. దాంతో ప్రస్తుతం ఆమె వరుస అవకాశాల్ని దక్కించుకుంటొంది.