చరణ్, క్రిష్ కు సినిమా ఇచ్చే చాన్సే లేదు!

‘కంచె’ సినిమా సమయంలోనే చరణ్, క్రిష్ తో కలిసి ఓ సినిమా చేస్తానని కమిట్ అయ్యాడు. చరణ్ కు తగ్గట్లుగా క్రిష్ ఓ కథను కూడా సిద్ధం చేసుకున్నట్లు టాక్. కానీ ఇప్పుడు ఆ సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఇటీవల క్రిష్ ‘శాతకర్ణి’ ఆడియో ఫంక్షన్ లో ‘ఖబఢ్ధార్’ అంటూ పరోక్షంగా మెగాఫ్యామిలీకు వార్నింగ్ ఇచ్చాడు. మెగాఫ్యామిలీను ఉద్దేశించి తను అలా మాట్లాడలేదని క్రిష్ ఎంతగా చెప్పినా.. అసలు విషయం ఏంటో అందరికీ తెలిసిందే.

క్రిష్ ఉద్దేశపూర్వకంగానే అలా మాట్లాడాడని ఇప్పటికీ మెగాభిమానులు నమ్ముతున్నారు. ఈ క్రమంలో క్రిష్ కు ఛాన్స్ ఇచ్చి మెగాభిమానుల ఆగ్రహానికి గురికావాలని చరణ్ అనుకోవట్లేదు. అందుకే క్రిష్ కు నో చెప్పాలని చరణ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్ కూడా వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా గడుపుతున్నాడు. సుకుమార్ సినిమా పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.