ఆర్‌ఆర్‌ఆర్‌: భీమ్‌ వచ్చేశాడు


టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరన్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న భారీ మల్టీస్టారర్‌ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే 75 శాతం పైగా షూటింగ్ జరుపుకున్నది. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నారు. కాగా ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ ఇవాళ 11:30 నిమిషాలకు రాజమౌళి విడుదల చేశారు. ఈ టీజర్‌లో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. రామ్ చరణ్ వాయిస్ ఓవర్‌ అదుర్స్. ఈ టీజర్ ను మొత్తం ఐదు భాషల్లో విడుదల చేశారు. ఇప్పటికే రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా ‘భీమ్ ఫర్ రామరాజు’ రామ్ చరణ్ టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

CLICK HERE!! For the aha Latest Updates