పవన్ ఎక్కడ ప్లాన్ చేశాడు..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు డాలీ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘కాటమరాయుడు’. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ తో సందడి చేశాడు పవన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పుడు ఆడియో విడుదలకు సమయం వచ్చింది. అయితే ఈ ఆడియో వేడుక ఎక్కడ నిర్వహిస్తారనేది హాట్ టాపిక్ అయింది.

ఫిబ్రవరి సినిమా పాటలను చిత్రీకరించడంతో పాటు అదే నెలలో ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ కాబట్టి అనంతపూర్ లోనే ఫంక్షన్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారట. లేదంటే తిరుపతిలో ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో ఆడియో ఫంక్షన్ కు అనువుగా ఉండే ప్రదేశంలో చేస్తారని తెలుస్తోంది. త్వరలోనే దీని గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సివుంది!