HomeTelugu News'క్షీర సాగర మథనం' ప్రియాంత్ ఫస్ట్‌లుక్‌

‘క్షీర సాగర మథనం’ ప్రియాంత్ ఫస్ట్‌లుక్‌

7 5

మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందుతున్నఈ చిత్రం ‘క్షీర సాగర మథనం’. ఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటిస్తున్నారు.అనిల్ పంగులూరి దర్శకత్వం వహిస్తున్నారు. అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర విలన్‌గా నటిస్తున్నాడు. యంగ్‌ హీరో సందీప్ కిషన్ ఈ చిత్రం టైటిల్ లోగోను విడుదల చేయగా- బహుముఖ ప్రతిభాశాలి అడివి శేష్ ‘క్షీరసాగరమథనం’ పోస్టర్ ను లాంచ్ చేశారు. చిత్ర హీరోయిన్‌ అక్షత సోనావని ఫస్ట్‌లుక్‌ను హాట్‌ బ్యూటీపాయల్ రాజ్ పుట్ విడుదల చేసింది.

ఇప్పుడు తాజాగా ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న ‘ప్రియాంత్’ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి మాట్లాడుతూ.. ‘క్షీర సాగర మథనం’ చిత్రాన్ని ఐదు విభిన్న కథల సమాహారంగా రూపొందిస్తున్నాము. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. కొత్త తరహా చిత్రాలను ఆదరించడంలో ఎప్పుడూ ముందుండే మన ప్రేక్షకులు.. “క్షీర సాగర మథనం” చిత్రాన్ని హృదయాలకు హత్తుకుంటారనే నమ్మకం ఉంది” అన్నారు.చరిష్మా శ్రీకర్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అజయ్‌ అరసాడ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!