HomeTelugu Trending'మల్లేశం'కు కేటీఆర్‌ ప్రశంసలు

‘మల్లేశం’కు కేటీఆర్‌ ప్రశంసలు

11 12మల్లేశం పాత్రలో ప్రియదర్శి బాగా నటించారని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రశంసించారు. మల్లేశం సినిమాకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవితకథ ఆధారంగా..’మల్లేశం’ సినిమా రూపొందిన తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక సామాన్యుడి జీవితాన్ని తెరపై ఆవిష్కరించిన విధానం బాగుందని కేటీఆర్‌ ప్రశంసలు కురిపించారు. మల్లేశం సినిమా ఎంతో హృద్యంగా, మానవీయంగా ఉందని పేర్కొన్నారు. అంతరించిపోతున్న చేనేత కళకు మల్లేశం చిత్రం జీవం పోసిందని మూవీ యూనిట్‌ను అభినందించారు. సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడి ఈ సినిమాకు వినోదపు పన్ను రాయితీ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.

నవీన ఆవిష్కరణల రూపకల్పనలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయని.. మల్లేశం వాటిని అధిగమించి ఆసుయంత్రం తయారుచేసి ఎంతో మంది తల్లులకు ఉపశమనం కల్పించారని కేటీఆర్‌ కొనియాడారు. ఈ సినిమా మాటల రచయిత పెద్దింటి అశోక్‌ కుమార్‌ అజ్ఞాతసూర్యుడు అంటూ ప్రశంసించారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేస్తుందన్నారు. ఇక ఈ సినిమా తర్వాత చేనేత వస్త్రాలు ధరించడం మరింత పెరుగుతుందని కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!