సిరిసిల్లలో కేటీఆర్‌ ఘన విజయం

తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం కొనసాగుతోంది. సిరిసిల్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి కేటీఆర్‌ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్‌కు చెందిన సమీప ప్రత్యర్థి కె.కె. మహేందర్‌రెడ్డిపై కేటీఆర్‌ జయకేతనం ఎగురవేశారు. 2009 నుంచి శాసనసభ్యుడిగా కొనసాగుతున్న కేటీఆర్‌.. 2010 ఉప ఎన్నికతో పాటు 2014 ఎన్నికల్లోనూ సిరిసిల్ల నుంచే గెలుపొందారు.

2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కేకే మహేందర్‌రెడ్డి 171 ఓట్ల స్వల్ప తేడాతో కేటీఆర్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. 2010 ఉప ఎన్నికల్లో మరోమారు కాంగ్రెస్‌ అభ్యర్థిగా కేటీఆర్‌తో తలపడి 68,220 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కొండూరి రవీందర్‌రావును బరిలో దింపగా కేటీఆర్‌ 53 వేల ఓట్ల మెజార్టీతో నెగ్గారు. తాజాగా మరోమారు కాంగ్రెస్‌ అభ్యర్థిగా కేకే మహేందర్‌రెడ్డి కేటీఆర్‌తో తలపడి ఓటమి పాలయ్యారు.

CLICK HERE!! For the aha Latest Updates