వర్మ వాస్తవాలను చూపితే చాలు: లక్ష్మీపార్వతి!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ ను లక్ష్మీపార్వతి కోణంలో తెరకెక్కించనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధీచిన ప్రధాన పాత్రధారుల ఎంపిక విషయంలో వర్మ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ పాత్రధారిని ఎంపిక చేసి శిక్షణకు పంపినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ బయోపిక్ ను రూపొందించే విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది లక్ష్మీపార్వతి. ఈ సినిమా తీయడానికి వర్మ.. ఎన్టీఆర్ కుటుంబీకులను కలవనని ప్రకటించాడు.

సాధారణంగా బయోపిక్స్ ను తెరకెక్కించే ముందు సదరు వ్యక్తిని సంప్రదించడం లేదా వారికి సంబంధించిన వారిని కలవడం జరుగుతుంటుంది. కానీ వర్మ అలా చేయనని స్పష్టం చేశాడు. ఈ విషయంపై స్పందించిన లక్ష్మీపార్వతి.. తనను వర్మ కలవకపోయినా.. పర్వాలేదని చెప్పింది.

ఒకవేళ వర్మ తనను కలిసి సినిమా చేస్తే నేను చెప్పినట్లుగా సినిమా చేశారనే అపవాదు వస్తుంది. కాబట్టి వర్మ నిజాలు చూపగలిగితే చాలు.. అంతకుమించి ఏది కోరుకోవడం లేదని అన్నారు.