ఆ హీరోలపై తన అభిప్రాయం చెప్పిన లావణ్య త్రిపాఠి


టాలీవుడ్‌ లో ‘అందాల రాక్షసి’ ఎంట్రీ ఇచ్చి తరువాత వరుసగా అవకాశాలను పొందిన నటి లావణ్య త్రిపాఠి. ఆమె తాజాగా కాసేపు నెటిజన్లతో చిట్ చాట్ చేశారు. ఏ హీరోపై తన అభిప్రాయం ఎలాంటిదన్న విషయాంపై తన స్పందన తెలియజేసింది ఈ బ్యూటీ. నెటిజన్లు ఒక్కో హీరో ప్రస్తావన తెస్తుంటే, ఒక్కో సమాధానం చెప్పింది. ప్రభాస్ పేరు చెప్పగానే.. చాలా కూలెస్ట్ గా ఉంటాడని చెప్పింది. రామ్ చరణ్ అంటే ఓ అద్భుతమని, ఆయన నటించిన ‘రంగస్థలం’ తనకు చాలా ఇష్టమైన సినిమా అని చెప్పింది.

ఇక తారక్‌ ను ఎవరూ మ్యాచ్ చేయలేరని, ‘ఆర్ఆర్ఆర్’ లో లుక్ కోసం వెయిట్ చేస్తున్నాని చెప్పింది. షారూఖ్ నటించిన చిత్రాల్లో ‘చక్ దే ఇండియా’ ఇష్టమని తెలిపింది. అల్లు అర్జున్ పేరు ప్రస్తావనకు రాగానే, ‘పుష్ప’ ఫస్ట్ లుక్ చింపేసిందని, ఇంకో బ్లాక్ బస్టర్ పక్కాగా వస్తుందన్న నమ్మకం ఉందని చెప్పింది.

పవన్ కల్యాణ్, ప్రతి విషయంపైనా స్పందిస్తారని, ఆయన ధైర్యంపై తనకు ఎంతో గౌరవం ఉందని, నిజమైన హీరో మెగాస్టార్ చిరంజీవని, తాను ఆరాధించే నటుల్లో ఆయన ఒకరని తెలిపింది. చిరంజీవి చాలా మంచి వ్యక్తని, ఆయనలోని దయాగుణం, వినయం తనకు ఆదర్శమని చెప్పుకొచ్చింది ఈ అందాల రాక్షసి.