HomeTelugu Big Storiesఅసలు ఆగట్లేదుగా.. పెళ్లిళ్లపై మాధవీలత పోస్ట్‌ వైరల్‌

అసలు ఆగట్లేదుగా.. పెళ్లిళ్లపై మాధవీలత పోస్ట్‌ వైరల్‌

4 15
కరోనా వైరస్‌ దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రజలంతా గడప దాటడం లేదు. లాక్‌డౌన్ కారణంగా అన్ని రంగంలు బ్రేక్‌ పడింది. సినిమా షూటింగ్ లు పెళ్లిళ్లు అన్నీ కూడా ఆగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల లాక్‌డౌన్ లో కొన్ని సడలింపులు చేసింది అందులో పెళ్లిళ్లు కూడా ఉన్నాయి. ఇరవై మందితో పెళ్ళితంతు పూర్తి చేసుకోవచ్చు అని కేసీఆర్ తెలిపారు. దాంతో వాయిదా పడిన పెళ్లిళ్లన్నీజరుగుతున్నాయి. ఇక సెలబ్రెటీలు కూడా తక్కువ మందితో నిరాడంబరంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో నటి బీజేపీ నాయకురాలు మాధవీ లత లాక్‌డౌన్ లో జరుగుతున్న పెళ్లిళ్లపై కామెంట్లు చేసింది. యంగ్ హీరో నిఖిల్ – పల్లవి వర్మల పెళ్లి కొద్దిమంది అతిథుల మధ్య నిరాడంబరంగా జరిగింది. లాక్‌డౌన్ రూల్స్ పాటిస్తూ టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు కూడా రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లిళ్లపై మాధవీ లత ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేసింది. ”అసలు ఆగట్లేదుగా జనాలు.. మాస్కులు వేసుకుని పెళ్లిళ్లు ఎందుకు? ముహూర్తం మళ్లీ రాదా? ఇది పోతే శ్రావణం.. అదీ పోతే మాఘమాసం.. లేకుండా మరో సంవత్సరం తరువాత ముహూర్తం వస్తుంది కదా.. ఏ పెళ్లి పిల్ల దొరకదా.. లేకుంటే పిల్లోడు మారిపోతాడా?? మాస్కు ముసుగులో పెళ్లి అవసరమా? కొన్నాళ్లు ఆగలేని వాళ్లు సంసారాలు చేస్తారా?? ఫిక్స్ అయిన మ్యారేజ్ లో గ్యాప్ వస్తే.. నిజాలు తెలిసి బంపర్ ఆఫర్ మిస్ అవుతున్నారు. సచ్చిపోతున్నార్రా నాయనా అంటే.. ఈ పెళ్లి ఏంటో.. నాకు అర్థం కావడం లేదు” అంటూనే ”నా పోస్ట్ నా ఇష్టం.. నా ఒపీనియన్ నేను చెప్తా.. నాకు ఆ హక్కు ఉంది” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు మాధవీ లత పోస్ట్ వైరల్ గా మారింది

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!