HomeTelugu Trendingధనుష్క్‌కు షాక్కిచ్చిన హైకోర్టు..

ధనుష్క్‌కు షాక్కిచ్చిన హైకోర్టు..

3 28
తమిళ స్టార్‌ హీరో, రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌కు మదురై కోర్టు గట్టి షాకిచ్చింది. ధనుష్‌ తమ కొడుకే అని చిన్న తనంలో మందలిస్తే ఇంటి నుంచి వెళ్లిపోయాడంటూ మదురైకి చెందిన దంపతులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ధనుష్‌ బర్త్‌ సర్టిఫికెట్‌తో పాటు నివాసం, విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఎక్కడున్నాయని ప్రశ్నించింది కోర్టు. ధనుష్ తన బర్త్‌ సర్టిఫికెట్‌ను ఇంత వరకూ ఎందుకు సమర్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే ధనుష్‌కు సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు కోర్టులో అందజేయాలని చెన్నై కార్పోరేషన్‌ను ఆదేశించింది. మరోవైపు తమ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ తామెవరో తెలయదంతుంటే భరించలేకపోతున్నాం అంటున్నారు కదిరేషన్‌, మీనాక్షి దంపతులు. డీఎన్‌ఏ పరీక్షలు చేయిస్తే అసలు నిజం బయటపడుతుందన్నది వాళ్ల వాదన. ధనుష్‌ తన పుట్టుమచ్చులు చెరిపించుకున్నాడనే వ్యవహారం గతంలో సంచలనంగా మారింది. అయితే తన యాక్టింగ్ వృత్తిలో భాగంగానే అలా చేసినట్టు ధనుష్‌ అప్పట్లో క్లారిటీ ఇచ్చాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!