‘మన్మధుడు-2’లో మహానటి

ప్రముఖ నటుడు నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ‘మన్మధుడు 2’ సినిమా షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్ లో జరుగుతున్నది. మన్మధుడు సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. షూటింగ్ స్పాట్ నుంచి విడుదల చేస్తున్న ఫోటోలు ఈ హైప్ కు మరో కారణం. రకుల్ మెయిన్ హీరోయిన్ గా చేస్తుండగా, సమంత ఓ స్పెషల్ పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. సమంతకు సంబంధించిన షూట్ ఇటీవలే పూర్తయింది.

మరో విశేషం ఏమంటే.. ఈ చిత్రంలో మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ ఓ కీలక పాత్రలో కనిపిస్తుందని సమాచారం. ఆమెకు సంబంధించిన సీన్స్ ను షూట్ చేస్తునట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు

CLICK HERE!! For the aha Latest Updates