‘ఎన్టీఆర్’ మహానాయకుడు వాయిదా?

స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ను బాలకృష్ణ నిర్మిస్తూ, నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌ను వెండితెరపై రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌ సినీ జీవితాన్ని ‘కథానాయకుడు’ గానూ, రాజకీయ జీవితాన్ని ‘మహానాయకుడు’గానూ విడుదల చేయనున్నారు. అయితే గతంలో ఈ రెండు పార్ట్‌లకు సంబంధించిన రిలీజ్‌ డేట్స్‌ (జనవరి 9, 24)ను చిత్రబృందం ప్రకటించింది .

అయితే తాజాగా ఈ సినిమాను కొన్న బయ్యర్లు చేసిన విజ్ఞప్తిని చిత్రయూనిట్‌ పరిగణలోకి తీసుకుందని సమాచారం. ఈ రెండు పార్ట్‌లకు రెండు వారాలే గ్యాప్‌ ఉంటే నష్టపోయే అవకాశం ఉందని బయ్యర్లు ఆందోళన చేశారని, వారి విజ్ఞప్తి మేరకు రెండో పార్ట్‌ ‘మహానాయకుడు’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారని సమాచారం. ఇంతకు ముందే ‘మహానాయకుడు’ విడుదల వాయిదా కానుందని ప్రచారం సాగినా.. వాటిపై మేకర్స్‌ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఒకవేళ సినిమా పోస్ట్ ఫోన్ చేస్తే.. ఫిబ్రవరి 14 వ తేదీన సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉన్నట్టుగా సమాచారం.