‘మహర్షి’కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన ప్రముఖులు

స్టార్‌ హీరో మహేష్‌బాబు నటించిన ‘మహర్షి’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా ప్రారంభమైంది. వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్‌రాజు, అశ్వినిదత్‌, ప్రసాద్ వి పొట్లూరి నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్‌. మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకటేష్‌‌, విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘మహర్షి’ మహేష్‌ 25వ చిత్రం కావడం విశేషం. ఈ వేడుకలో మహేష్‌తో కలిసి పనిచేసిన వివిధ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆయన గురించి ఏమన్నారనే దానిపై ఓ వీడియోను రూపొందించారు.

-దర్శకుడు కె.రాఘవేంద్రరావు: 25 సినిమాలు పూర్తి చేసినందుకు మహేష్‌బాబుకు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌ కృష్ణ ఎంత ఆనందపడుతున్నారో.. నేనూ అంతే ఆనందపడుతున్నా. నువ్వు షూటింగ్‌ సమయంలో ఎంతో ప్రేమగా మామయ్య అని పిలిచే పిలుపు నాకు ఇంకా గుర్తుంది. నువ్వు ఇంకా గొప్ప నటుడివి అవుతావని ఆశిస్తూ గుడ్‌లక్.

-నటి కియారా అద్వాణీ: మహేష్‌, వంశీ, పూజా హెగ్డే, మొత్తం చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌. మీ ‘మహర్షి’ సినిమా కోసం ఎదురుచూస్తున్నా. మిమ్మల్ని మళ్లీ తెరపై చూడాలని ఆసక్తిగా ఉంది. మీతో కలిసి పనిచేయడం నా అదృష్టం.

-దర్శకుడు కొరటాల శివ: మహేశ్‌బాబులాంటి నటుడితో సినిమా తీయడం అనేది కల నిజం కావడం లాంటిదే. ఓ దర్శకుడికి పూర్తిగా తను చెప్పేలా చేసే నటుడు దొరకడం చాలా కష్టం. ఓ సినిమా విజయం, అపజయాన్ని వారం, పది రోజులు గుర్తు పెట్టుకుంటాం. కానీ ఆ సినిమా ప్రయాణం ముఖ్యం. ఆయనతో ప్రయాణాన్ని అందరూ ఎంజాయ్‌ చేస్తారు. ఆల్‌ ది బెస్ట్‌ మహేశ్‌. ‘మహర్షి’ గొప్ప సినిమా అవుతుందని భావిస్తున్నా.

– నటి శ్రుతి హాసన్: శుభాకాంక్షలు మహేశ్‌ సర్‌. మీరు ఇలానే 25, 35, 45… ఎన్నో చిత్రాలు చేయాలని కోరుకుంటున్నా. మీకు ది బెస్ట్‌ లభించాలి.

-దర్శకుడు సుకుమార్‌: చిత్ర పరిశ్రమలోని ప్రతి దర్శకుడికీ ఆయనతో కలిసి పనిచేయాలనేది కల. నేను ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సెట్‌కు వెళ్లి కథ చెప్పినప్పుడు.. చిన్నపిల్లాడిలా విన్నారు. నాకు ముచ్చటేసింది. ఆయనకు అర్థం కాకపోతే సర్‌.. ఇంకోసారి చెప్పండి సర్‌ అని మళ్లీ అడిగేవారు. ఆయన తన నటనతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఆయన నాకు చాలా మంచి స్నేహితుడు.

– నటి కృతిసనన్‌: నా తొలి సహనటుడు మహేష్‌‌. ఆయన నన్ను కొత్త నటిలా ఎప్పుడూ చూడలేదు. ఆయన చాలా స్నేహంగా ఉంటారు. ఆయన గొప్ప వ్యక్తి, అద్భుతమైన తండ్రి.

– దర్శకుడు గుణశేఖర్‌: మా కాంబినేషన్‌లో వచ్చిన ‘ఒక్కడు’ సినిమా మహేష్‌ ఏడో సినిమా. అప్పుడే ఆయన 25వ సినిమా వస్తోందంటే ఆశ్చర్యంగా ఉంది. మహేష్‌ ఓ దర్శకుడ్ని ఎంతో ప్రోత్సహిస్తారు. ‘మహర్షి’ సినిమాకు ఆల్‌ ది బెస్ట్‌.

– తమిళ నటుడు ఎస్‌.జె.సూర్య: ఓ షాట్‌ పర్‌ఫెక్ట్‌గా వచ్చిన తర్వాతే మరో షాట్‌కు మహేష్‌ సిద్ధమౌతారు. రాకపోతే ఒప్పుకోరు. ‘మహర్షి’కి ఆల్‌ ది బెస్ట్.

– దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌: మహేశ్‌ 25వ సినిమా ‘మహర్షి’కి ఆల్‌ ది బెస్ట్‌.

– నటి సమంత: నేను సినీ నేపథ్యం నుంచి రాలేదు. నాకు ఇక్కడ మెంటార్స్‌ లేదు. నా సినీ కెరీర్‌ ప్రారంభంలోనే మహేశ్‌తో కలిసి నటించడం నా అదృష్టం. ఆయన నాకు ఓ సలహా ఇచ్చారు. ప్రతి సినిమాను నీ తొలి సినిమాలా ట్రీట్‌ చెయ్యి అని ఆయన సలహా ఇచ్చారు. ధన్యవాదాలు మహేష్‌ సర్‌. మీ 25వ సినిమాకు ఆల్‌ ది బెస్ట్‌.

– దర్శకుడు శ్రీనువైట్ల: మహేష్‌ దర్శకుడికి 100 శాతం స్వేచ్ఛ ఇస్తారు. దాని వల్లే ఆయన ఎన్నోనాణ్యమైన చిత్రాలకు కారణమయ్యారు. ఆయన్ను ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో చూడాలని నాకు ఉంది.

– దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల: ‘మహర్షి’ సినిమా చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌.

– దర్శకుడు గోపాల్‌: మహేశ్‌తో నేను ‘వంశీ’ సినిమా చేశా. మా మహేష్‌‌, నమ్రత ఎప్పుడూ చాలా బాగుండాలి. మహేష్‌ ఇంకా సూపర్‌హిట్‌ చిత్రాలు తీయాలని కోరుకుంటున్నా. ‘మహర్షి’ హిట్‌ కావాలి. ఆల్‌ ది బెస్ట్.

– నటి ఇలియానా: హాయ్‌ మహేష్‌ .. నీ 25వ సినిమా ‘మహర్షి’కి శుభాకాంక్షలు. పోకిరి చాలా ప్రత్యేకమైన సినిమా. దానితో నాకు ఎన్నో అనుబంధాలు ఉన్నాయి. మహేష్‌ ఎంతో స్పెషల్‌, ఆయన ఓ జ్ఞాపకం.. భవిష్యత్తులో మనం కలిసి పనిచేస్తామని ఆశిస్తున్నా. ఆల్‌ ది బెస్ట్‌.

– త్రివిక్రమ్ శ్రీనివాస్‌: ఆల్‌ ది బెస్ట్‌ మహేష్‌‌.

– దర్శకుడు జయంత్‌: మహేశ్‌ నీ 25వ సినిమాకు ఆల్‌ ది బెస్ట్‌. అప్పుడే ఇన్ని సినిమాలు తీసేశావ్‌.. కాలం వేగంగా వెళ్తోంది. ‘రాజకుమారుడు’ కోసం కలిసి పనిచేశా.. ఇప్పుడు నువ్వు సూపర్‌స్టార్‌.

– దర్శకుడు వై.వి.ఎస్‌. చౌదరి: చందమామ కన్నా చల్లనివాడు. చిన్న కృష్ణయ్య కన్నా అల్లరివాడు.. ప్రిన్స్‌ మా యువరాజుకు ఆల్‌ ది బెస్ట్‌. ఆయన మరో 100 సినిమాలు తీయాలని కోరుకుంటున్నా