మహేష్‌ బాబు 27వ మూవీ అప్పుడేనట!


సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు 27 వ సినిమా ఎవరితో చేయబోతున్నారు అనే ఉత్కంఠతకు దాదాపుగా తెరపడింది. అనిల్ రావిపూడితో సినిమా చేసే సమయంలో తరువాతి సినిమాను వంశీ పైడిపల్లితో చేస్తారని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా అనేకమంది డైరెక్టర్‌లు తెరమీదకు వచ్చారు.

కాగా, పరశురామ్ ఇటీవలే మహేష్ బాబుకు ఓ స్టోరీ చెప్పారట. ఈ స్టోరీ మహేష్ బాబుకు నచ్చడంతో సినిమా చేసేందుకు ఒకే చెప్పారట. ప్రస్తుతం పరశురామ్ స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి విషయాలను ప్రకటించే అవకాశం ఉన్నది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ పతాకంపై సినిమాను నిర్మించబోతున్నారు. జూన్ నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందట. వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా సినిమాను విడుదల చేయాలని భావిస్తోంది చిత్రం బృందం.