ఈసారి మరింత యంగ్ లుక్ తో కాలేజ్‌కి వెళ్లనున్న మహేశ్!


సూపర్‌ మహేశ్ బాబు.. వరుస హిట్‌తో మంచి జోష్‌ మీద ఉన్నాడు. ఆయన చేసిన సినిమాలు భారీ విజయాలను నమోదు చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్‌ పరశురామ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. మహేశ్ బాబు వరుసగా సామాజిక సమస్యలతో ముడిపడిన కథలను చేస్తూ వస్తున్నాడు. దాంతో వాటిల్లో హీరోయిన్ పాత్రలకి .. ఆమెతో ప్రేమ ప్రయాణానికి సంబంధించిన నిడివి చాలా తక్కువగా ఉంటూ వస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌కి, మహేశ్‌ బాబు కి మధ్య సన్నీవేశాలు ఎక్కువగా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నాడట దర్శకుడు.

అందుకోసం మహేశ్ బాబును కొంతసేపు కాలేజ్ స్టూడెంట్ గా పరశురామ్ చూపించనున్నాడని అంటున్నారు. ఇంతకుముందు ‘శ్రీమంతుడు’ .. ‘భరత్ అనే నేను’ .. ‘మహర్షి’ సినిమాల్లో కాలేజ్ స్టూడెంట్ గా మహేశ్ బాబు కనిపించిన సంగతి తెలిసిందే. అలాగే పరశురామ్ కూడా స్టూడెంట్ గా మరింత యంగ్ లుక్ తో మహేశ్ బాబును చూపించనున్నాడని చెబుతున్నారు. ఇందుకోసం మహేశ్ కూడా కొంత బరువు తగ్గుతున్నాడని అంటున్నారు. ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారట.