మహేష్ గడువు రెండు వారాలు మాత్రమే!

మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో వస్తోన్న ‘స్పైడర్’ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాలి. కానీ దర్శకుడు మురుగదాస్ సినిమాను చెక్కుతూనే ఉన్నాడు. దీంతో మహేష్ ఇక తను ఈ సినిమా కోసం డేట్స్ ఇవ్వలేనని ఎట్టిపరిస్థితుల్లో మరో రెండు వారాల్లో సినిమా షూటింగ్ పూర్తి చేయమని దర్శకుడికి చెప్పెశాడట. ఇంతకాలం మహేష్ కూడా ఓపికగా తన సమయాన్ని ఇస్తూ వస్తున్నాడు. అయినా.. మురుగదాస్ ఆలస్యం చేస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది.

అందుకే ఈ నెల 20వ తేదీ నాటికి సినిమా షూటింగ్ పూర్తి చేయమని మహేష్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి కొరటాల సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాలనేది మహేష్ ప్లాన్. ఆ కారణంగానే మహేష్ టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది. మరి మురుగదాస్, మహేష్ ఇచ్చిన సమయంలో షూటింగ్ పూర్తి చేస్తాడో.. లేక ఇంకా సమయం కావాలంటాడో.. చూడాలి!