HomeTelugu Trendingమహేష్‌బాబు త్రిపాత్రాభినయం..!

మహేష్‌బాబు త్రిపాత్రాభినయం..!

3 29
టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు అనిల్ రావిపూడి కంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కా బాప్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా సూపర్ స్టార్ పరశురామ్ డైరెక్షన్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య ఈ సినిమాకి ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఇక మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా గురించి మరో వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో మహేష్ బాబు త్రిపాత్రాభినయం కనిపించనున్నాడు అని వార్తలు వస్తున్నాయి. అందుకొరకు మహేష్ వర్కౌట్ చేస్తూ కొత్త మేకోవర్ కోసం ప్రయత్నిస్తున్నాడు అని తెలుస్తుంది. అయితే ఈ సినిమా గురించి మహేష్ ఇప్పటివకు స్పందించలేదు. ఈ నెల31 అంటే రేపు తన తండ్రి కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా సినిమా గురించి అధికారిక ప్రకటన చేస్తారు అని అభిమానులు ఎదురు చుస్తునారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!