రాజకీయ నేతలపై మహేష్ సెటైర్లు!

బిజినెస్ మెన్, పోకిరి వంటి సినిమాల్లో మహేష్ చెప్పిన డైలాగ్స్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మహేష్ నోటి నుండి వచ్చిన ఆ డైలాగ్స్ కు స్టార్ హోదా వచ్చేసింది. అటువంటి మహేష్ ఇప్పుడు పోలిటికల్ పంచ్ లు వేయనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు మహేష్ బాబు రాజకీయాలకు సంబంధించి నిజజీవితంలో గానీ, రీల్ లైఫ్ లో గానీ ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఏకంగా మన రాజకీయ నేతలపై సెటైర్స్ వేయడానికి సిద్ధమవుతున్నాడు.
‘శ్రీమంతుడు’ తరువాత మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. ఈ చిత్రానికి ‘భరత్ అను నేను’ అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్రకు తగ్గట్లుగానే పోలిటికల్ పంచ్ లను సిద్ధం చేశారట కొరటాల. రాజకీయ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లపై మహేష్ సెటైర్స్ వేయనున్నట్లు సమాచారం. మరి వీటిపై మన నేతలు వ్యతిరేకతను చూపిస్తారో.. లేదో.. చూడాలి!