HomeTelugu Trending9 మిలియన్ థ్యాంక్స్ చెప్పిన మహేష్‌బాబు

9 మిలియన్ థ్యాంక్స్ చెప్పిన మహేష్‌బాబు

J5 6
ప్రస్తుతం టాలీవుడ్‌లో నెంబర్ ఒన్ హీరోగా కొనసాగుతున్నాడు మహేష్ బాబు. ఈ సూపర్ స్టార్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలుసు. ఇటీవల సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు మహేష్. తాజాగా మహేష్ సౌత్ ఇండియా లో ఏ హీరో క్రియేట్ చేయని రికార్డును క్రియేట్ చేసాడు. సోషల్ మీడియాలో మహేష్‌కి ఉన్నంత ఫాలోయింగ్ దక్షిణాదిన మరే సెలబ్రిటీకీ లేదు. తాజాగా మహేష్ బాబుకు ట్విట్టర్లో అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా ట్విట్టర్లో 9 మిలియన్ల మంది మహేష్‌బాబును ఫాలో అవుతున్నారు. ఈ రికార్డు క్రియేట్ చేసిన ఏకైక సౌత్ హీరో మహేష్ మాత్రమే.

2010 ఏప్రిల్‌లో మహేష్ ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేశారు. అప్పటి నుంచి తన కుటుంబంతో దిగిన ఫొటోలు, వీడియోలు అభిమానులతో పంచుకోవడం తెలిసిందే. అలా ట్విట్టర్‌లో 9 మిలియన్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు మహేష్. ఈ సందర్భంగా 9 మిలియన్ థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశారు. తనపై ఇంతటి అభిమానం, ప్రేమ చూపించిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. ప్రస్తుతానికి షూటింగ్ నుంచి విరామం తీసుకుంటున్న మహేష్‌బాబు వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో నటించనున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!