సంక్రాంతి బరిలో మహేష్ సరిలేరు నీకెవ్వరు

మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల తేదీని ఈరోజే ప్రకటించారు. ఇప్పటి వరకు సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టేందుకు మహేష్ బాబు సినిమాతో పాటు బన్నీ అలవైకుంఠపురములో సినిమా సిద్ధం చేస్తున్నారు. వీరితో పాటు కళ్యాణ్ రామ్‌ మూవీ ఎంత మంచి వాడవురా కూడా సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మహేష్‌బాబు కెరీర్‌లో 26వ చిత్రంగా తెరకెక్కుతున్నసరిలేరు నీకెవ్వరు మూవీ 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి హ్యాట్రిక్ విజయాల తర్వాత సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటిస్తున్న చిత్రమిది. అనిల్ రావిపూడి దర్శకత్వంతో చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్, ఏకే ఎంటర్‌టైన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందనా, అదితీ రావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.

ప్రతి సంక్రాంతి మాదిరిగానే వచ్చే సంక్రాంతి బాక్సాఫీస్ వార్ మంచి రంజుగా మారింది. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘అల వైకుంఠపురంలో’, మహేష్-అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. జనవరి 12 ఈ ఇద్దరూ హీరోలో ఢీ బాక్సాఫీస్ బరిలో కొట్టబోతున్నారు.