HomeTelugu Newsమహేష్, విజయ్ కలిసి నటిస్తున్నారా?

మహేష్, విజయ్ కలిసి నటిస్తున్నారా?

 

14
వరుస సినిమాలతో దూసుకెళుతున్న విజయ్‌ దేవరకొండ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్‌ సినిమాలో విజయ్‌ కోసం ప్రత్యేకంగా ఓ పాత్ర రూపొందించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’తో బ్లాక్‌బస్టర్‌ హిట్టు కొట్టిన మహేష్ బాబు ఆ విజయాన్ని ఆస్వాదిస్తూ కుటుంబంతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ తన తర్వాతి సినిమాను ‘మహర్షి’ దర్శకుడు వంశీ పైడిపల్లికి అప్పగించారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, యువ సంచలనం విజయ్‌దేవరకొండ కలిసి నటిస్తే ఆ కిక్కే వేరని అభిమానులు భావిస్తున్నారు. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా తెరకెక్కబోతుంది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అతిథి పాత్రలో కనిపిస్తారని,
ఇప్పటికే ఈ హీరోతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

మహేశ్‌, వంశీపైడిపల్లి కాంబినేషన్‌లో వచ్చిన ‘మహర్షి’ సూపర్‌ డూపర్‌ హిట్టు సాధించిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో పాటు మహేశ్‌బాబు రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. అందుకే మహేష్ తన తర్వాతి సినిమా బాధ్యతలు వంశీకి అప్పగించాడట. వచ్చే ఏడాది సంక్రాంతికి పూర్తిచేయాలని నిర్మాతల సన్నాహాలు. ఇంకా ఈ సినిమాలో కియారాను హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నారట. మరోవైపు విజయ్‌ దేవరకొండ నటించిన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ ఈ నెల 14న లవర్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు, టీజర్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!