రజినీకాంత్ సినిమాలో మరో స్టార్ హీరో..?

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు పా.రంజిత్ ‘కాలా’ అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రజినీకాంత్ అల్లుడు హీరో ధనుష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందని తెలుస్తోంది. దానికోసం మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని రంగంలోకి దింపడానికి ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో నటించడానికి ముమ్ముట్టి కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

గతంలో దాదాపు రెండు దశబ్ధాల క్రితం రజినీకాంత్, ముమ్ముట్టిలు కలిసి ‘దళపతి’ అనే సినిమాలో నటించారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మళ్ళీ ఇన్నేళ్లకు ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుండడం విశేషం. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ తో అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమాలో రజినీకాంత్ మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.