
Manchu Manoj Arjun Reddy:
Manchu Manoj ప్రస్తుతం తన తాజా సినిమా భైరవం రిలీజ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. మే 30న విడుదల కానున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఆయనతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మనోజ్‌కి మంచి కంబ్యాక్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో మనోజ్ చేసిన ఓ రివీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “తన కెరీర్‌లో ఎంతగానో మిస్ అయిన సినిమాలు ఏవైనా ఉన్నాయా?” అనే ప్రశ్నకు మనోజ్ ఇచ్చిన సమాధానం అందరిని ఆశ్చర్యపరిచింది.
View this post on Instagram
ఆయన మాటల్లోనే – “అర్జున్ రెడ్డి సినిమా మొదటి స్టేజ్‌లోనే సందీప్ రెడ్డి వంగా నాకు కథ చెప్పాడు. కానీ అప్పట్లో పోటుగాడు సినిమాతో బిజీగా ఉండటంతో ఆ సినిమా నన్ను వదిలింది. తర్వాత అది విజయ్ దేవరకొండకి వెళ్లింది.” అంటూ పేర్కొన్నారు.
అంతేకాకుండా, రామ్ చరణ్ నటించిన రచ్చ, నాగ చైతన్య నటించిన ఆటో నగర్ సూర్య సినిమాలు కూడా తనకు అప్పట్లో దక్కే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అయితే ఆ సినిమాలు తన దగ్గర ఉన్నవాళ్ల దగ్గరకి వెళ్లడంతో తాను ఎలాంటి బాధపడలేదన్నారు.
ఈ వ్యాఖ్యలతో మనోజ్ కెరీర్‌లో ఏ రేంజ్ మార్పులు వచ్చేవో అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ప్రత్యేకించి అర్జున్ రెడ్డి లాంటి సినిమా మిస్ కావడం అంటే ఎంతటి నష్టమో అని కూడా ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ALSO READ: Triptii Dimri ఖాతాలో ఇన్ని పెద్ద సినిమాలు ఉన్నాయా?












