
Triptii Dimri Upcoming Movies:
Triptii Dimri ఈ పేరే ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్. లైలా మజ్నూ సినిమాతో ఆకట్టుకున్న ఈ భామ బుల్బుల్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించింది. కానీ ఆమెకు స్టార్ స్టేటస్ తీసుకువచ్చిన సినిమా యానిమల్. రణబీర్ కపూర్‌తో కలిసి నటించిన ఆ సినిమాలో చిన్న రోల్‌నే చేసినా, ఆమె పెర్ఫార్మెన్స్‌కి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు త్రిప్తికి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ మూవీకి హీరోయిన్‌గా ఎంపిక కావడం ఆమె కెరీర్‌లో బిగ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. దీన్ని డైరెక్ట్ చేస్తున్నవాడు సందీప్ రెడ్డి వంగా కావడంతో హైప్ మామూలుగా లేదు. దీన్ని ముందుగా దీపికా పదుకునే చేయాల్సిందని టాక్, కానీ ఆమె బయటకి వచ్చేసిన తర్వాత ట్రిప్తీకి ఛాన్స్ వచ్చింది.
View this post on Instagram
ఇదే సందీప్ – త్రిప్తి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా. మొదటిది యానిమల్. ఇప్పుడు స్పిరిట్లో త్రిప్తి పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనుందట. ఫ్యాన్స్ ఈ కాంబో గురించి థ్రిల్లింగ్‌గా ఫీల్ అవుతున్నారు.
త్రిప్తి దిమ్రి అప్‌కమింగ్ మూవీస్ లిస్ట్:
1. ధడక్ 2
2. అర్జున ఉస్త్రా
3. ఇమ్తియాజ్ అలీ డైరెక్షన్‌లో ఓ అన్‌టైటిల్ ప్రాజెక్ట్
4. రేస్ 4: రీలోడెడ్
5. స్పిరిట్
6. యానిమల్ పార్క్
ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ నుంచీ పవర్‌ఫుల్ యాక్షన్ మూవీ వరకూ విభిన్నమైన రోల్స్ చేస్తోంది త్రిప్తి. చిన్నపాటి రోల్స్ నుంచి స్టార్ హీరోయిన్ దిశగా ఆమె ప్రయాణం కొనసాగుతోంది. బాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత ప్రామిసింగ్ యాక్ట్రెస్‌లలో ఆమె ఒకరిగా మారింది.
ALSO READ: Sandeep Vanga వివాదంపై నోరు విప్పిన Deepika Padukone













