కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న మోహన్‌బాబు


టాలీవుడ్‌ నటుడు, కలెక్షన్‌ కింగ్‌ మంచు మోహన్‌బాబు కరోనా వ్యాక్సిన్‌ తొలి డోసును తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం మోహన్‌బాబు కోవిడ్‌ టీకాను తిరుపతిలో తీసుకున్నారు. “ఈ రోజు నేను తిరుపతిలో కోవిడ్‌ తొలి డోసు వ్యాక్సినేషన్‌ను తీసుకున్నాను. నిస్వార్థంగా వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్స్‌, ఇతర వైద్య సిబ్బందికి చేతులెత్తి దణ్ణం పెడుతున్నాను. విలువైన సమయాన్ని వృథా చేయకండి. వ్యాక్సిన్ వేసుకోడానికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

CLICK HERE!! For the aha Latest Updates