HomeTelugu Trending'శ్రీదేవి సోడా సెంటర్' నుండి మందులోడా సాంగ్‌ విడుదల

‘శ్రీదేవి సోడా సెంటర్’ నుండి మందులోడా సాంగ్‌ విడుదల

Mandhuloda
టాలీవుడ్‌ హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’ . ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టైటిల్ తోనే ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్.. ఆ తరువాత విడుదలైన గ్లిమ్స్ విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో స్వర మాంత్రికుడు మణిశర్మ ట్యూన్ చేసిన మాస్ కా బాస్ సాంగ్ ‘మందులోడా’ అంటూ సాగే ఓ పాటను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు.

‘మందులోడా ఓరి మాయలోడా’ అంటూ ఈ పాట జోరుగా .. హుషారుగా సాగుతోంది. జానపద బాణీలో మణిశర్మ స్వరపరిచిన ఈ పాట, మాస్ ఆడియన్స్ మనసు దోచేలా ఉంది. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా, సాహితి చాగంటి – ధనుంజయ ఆలపించారు. ‘శ్రీదేవి సోడా సెంటర్” సినిమాలో లైటింగ్ సూరిబాబు అనే మాస్ పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్నారు. ఆనంది హీరోయిన్ గా నటిస్తుండగా.. పావెల్ నవగీతన్, నరేష్, సత్యం రాజేష్, రఘుబాబు, అజయ్, హర్షవర్ధన్, సప్తగిరి, రోహిణి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ‘భలేమంచిరోజు’ ‘ఆనందో బ్రహ్మ’ ‘యాత్ర’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. విజయ్ చిల్లా – శశి దేవిరెడ్డి లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!