బన్నీ పాలిట విలన్‌గా మారిన దేశముదురు హీరోయిన్‌!

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్… త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఈరోజు ప్రారంభమైంది. రసూల్ పురలో రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బన్నీకి జోడిగా డీజే భామ పూజా హెగ్డే నటిస్తోంది. టబు మరో కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటె, ఇందులో మరో హీరోయిన్ కూడా నటిస్తోంది. దేశముదురు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న హన్సిక బన్నీ ఏఏ 19 లో నటిస్తోంది. కానీ, ఆమెది హీరోయిన్ పాత్ర మాత్రం కాదట. నెగెటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్ర ను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. కథ విన్నాక నెగెటివ్ పాత్రైనా సరే చేసేందుకు ఓకే చెప్పిందట హన్సిక. ఈ దేశముదురు హీరోయిన్ నెగెటివ్ రోల్ ను ఎలా చేస్తుందో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.