నాని కోసం మహేష్ నిర్మాణ సంస్థ!

మహేష్ తల్లి ఇందిర పేరున స్థాపించిన ఇందిరా ప్రొడక్షన్స్ ని తిరిగి మళ్ళీ బిజీ చేసే పనిలో మహేష్ సోదరి మంజుల నిమగ్నమయింది. స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘మనసుకు నచ్చింది’ సినిమాతో మంజుల కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా జనవరి 26న రానున్నది. ఈ సినిమా కంటే కూడా ఆమె తదుపరి ప్లాన్ చేస్తున్న సినిమా ఆసక్తి కలిగిస్తుంది. 

నాని హీరో విక్రమ్ కె కుమార్ ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడట. ఇటీవల నానిని కలిసి కథ కూడా వినిపించినట్లు తెలుస్తోంది. దానికి నాని కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని నటించిన ‘ఎంసిఏ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తరువాత కృష్ణార్జున యుద్ధం సినిమాను పూర్తి చేసి విక్రమ్ సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నాడు నాని. ఈ సినిమాను మంజుల తన సొంత బ్యానర్ లో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.