మహేష్ అభిమానులకు నిరాశే!

మహేష్, మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘స్పైడర్’ సినిమాను జూన్ 23న విడుదల చేస్తామని మొదట అనౌన్స్ చేశారు. కానీ అది కాస్త ఆగస్ట్ కు వెళ్లింది. అయితే ఇప్పుడు ఆగస్ట్ లో కూడా వస్తుందనే నమ్మకంలేదు. ఎందుకంటే ఈ సినిమా సీజీ వర్క్ కోసం మరింత సమయం తీసుకోవాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. నిజానికి మొదట ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కోసం సాధారణ బడ్జెట్ ను వేసుకున్నారు కానీ బాహుబలి2 సినిమా అనంతరం గ్రాఫిక్స్ ఆ రేంజ్ లోనే ఉండాలని హీరోతో పాటు దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

దీనికోసం బాహుబలి2 కి పని చేసిన మకుట సంస్థను రంగంలోకి దింపారు. అయితే గ్రాఫిక్స్ చేయడానికి సమయం పడుతుందని ముందే మకుట సంస్థ చెప్పేసిందట. తక్కువ సమయంలో పూర్తి చేయమని ప్రెషర్ పెడితే కష్టమని తాము తృప్థ్హి చెందిన తరువాతే ఔట్ పుట్ ఇస్తామని చెప్పడంతో ఇప్పుడు సినిమాఎప్పుడు విడుదలవుతుందనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. అదన్నమాట మేటర్.