అందుకే సీనియర్ హీరోలకు నో చెబుతోంది!

కీర్తి సురేష్ ఇప్పుడు దక్షిణాదిన ఉన్న హీరోయిన్లలో అమ్మడు పేరు బాగా వినిపిస్తోంది. క్రేజీ ప్రాజెక్ట్స్ తో ముందుకు దూసుకుపోతోంది. అయితే ఇటీవల కీర్తి సీనియర్ హీరోలతో వచ్చే అవకాశాలను కాదంటోందనే ప్రచారం ఊపందుకుంది. బాలయ్యతో కూడా సినిమాకు నో చెప్పిందని టాక్. ఈ విషయమై కీర్తి స్పందించింది .సీనియర్ హీరోలతో సినిమాకు నో చెప్పిన మాట వాస్తవమే అని అంగీకరించింది.

నాకు కూడా వారితో కలిసి నటించాలనుంది. కానీ ఇప్పట్లో కాదు. ఇప్పుడే సీనియర్ హీరోలతో కలిసి పని చేస్తే యంగ్ హీరోలతో కలిసి నటించే అవకాశాలు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే సీనియర్ హీరోల సినిమాలు అంగీకరించడం లేదు. కొన్నాళ్ళ పాటు యంగ్ హీరోలతోనే వర్క్ చేస్తాను. ఆ తరువాత కొంత గ్యాప్ ఇచ్చి పెద్ద హీరోలతో కూడా నటిస్తాను అంటూ డైరెక్ట్ గానే తనను పెద్ద హీరోల సినిమాలకు సంప్రదించవద్దని చెప్పేస్తోంది.