HomeTelugu Newsఆ దర్శకుడికే ఓటు వేస్తున్న మెగా హీరోలు..!

ఆ దర్శకుడికే ఓటు వేస్తున్న మెగా హీరోలు..!

16
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ చాలా ఎక్కువ. అలాగే వరుస విజయాలను అందుకున్న దర్శకుడు ఉన్నాడంటే హీరోలంతా అతడితోనే సినిమా చేయాలనుకోవడం కూడా సహజం. అయితే మెగాస్టార్ ఫ్యామిలీ కూడా అదే పంథా అనుసరిస్తోంది. మెగా హీరోలు అరడజనుకు పైగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ హీరోలంతా ఒకే దర్శకుడు వెంటపడుతున్నారు. టాలీవుడ్లో మినిమమ్ గ్యారెంటీ ఉన్న దర్శకుడు త్రివిక్రమ్. ‘అజ్ఞాతవాసి’ సినిమా తప్ప మిగిలినవన్నీ విజయాలు సాధించాయి. ఇప్పుడు మెగా హీరోలంతా ఈ దర్శకుడితోనే సినిమా చేయాలని అనుకుంటున్నారు.

ఇటీవల బన్నీతో ‘అల వైకుంఠపురం లో’ సినిమాతో హిట్ కొట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేస్తాడన్నది క్లారిటీ రాలేదు. త్రివిక్రమ్‌తో సినిమా చెయ్యాలనుందని మెగాస్టార్ చిరంజీవి ఆ మధ్య ఓ సందర్భంలో అన్నారు. దాంతో చిరంజీవితో సినిమా ఉండే అవకాశం ఉందని అభిమానులు అనుకుంటున్నారు. అలాగే రామ్ చరణ్ కూడా త్రివిక్రమ్ తో సినిమా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. పవన్ ప్రస్తుతం వరుసగా మూడు సినిమాలు కమిట్
అయ్యి ఉన్నాడు. ఆ తరువాత త్రివిక్రమ్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. బన్నీ కూడా త్రివిక్రమ్‌తో మరోసారి చెయ్యాలని చూస్తున్నాడు. మిగిలిన కుర్ర హీరోలు సాయి తేజ్ , వరుణ్ తేజ్ కూడా గురూజీతో ఒక్క సినిమా అయినా చెయ్యాలని ఆశపడుతున్నారు. ఇలా మెగా హీరోలంతా త్రివిక్రమ్ పైనే కన్నేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!