
తెలుగులో వచ్చిన సోషియో ఫాంటసీ సినిమాలలో ముందువరుసలో ఉంటుంది జగదేకవీరుడు-అతిలోక సుందరి సినిమా. 1990లో విడుదలైన ఈ సినిమా చిరంజీవి-శ్రీదేవి జంటగా నటించారు. సూపర్ డూపర్ హిట్ అందుకున్నఈ సినిమా ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయేది. ఈ సినిమా మొత్తం ఓ ప్రత్యేకతను చాటుకుంది.
ఆ తరహా కథలను చేయడానికి హీరోలు ఎవరూ ముందుకు రావడం లేదు. మరోసారి సోషియో ఫాంటసీ సినిమా చేసేందుకు చిరంజీవి సిద్ధమవుతున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది.
బింబిసార సినిమాతో దర్శకుడిగా నిరూపించుకున్న వశిష్ఠ, సోషియో ఫాంటసీ లైన్ చెప్పి చిరంజీవిని ఒప్పించాడని తెలుస్తోంది. ఈ సినిమాలో 8 మంది హీరోయిన్లు కనిపించ నున్నారని చెబుతున్నారు. వర్కింగ్ టైటిల్‌గా ‘ముల్లోక వీరుడు’ అంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి ‘భోళాశంకర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. అది పూర్తయ్యాక ఈ ప్రాజెక్టుపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు













