మెగాస్టార్‌, కొరటాల సినిమా అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అనంతరం తరువాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. సైరా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈ సినిమాను ఆగస్టు లేదంటే దసరాకు విడుదల చేయాలని అనుకుంటున్నారు.

కొరటాల శివ మెగాస్టార్ కోసం ఇప్పటికే కథను సిద్ధం చేసుకున్నారు. స్క్రిప్ట్ వర్క్స్ కూడా పూర్తయినట్టు సమాచారం. ఈ సినిమాను ఈ నెలలోనే లాంఛనంగా ప్రారంభం చేయబోతున్నారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్ని నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.