నాని ‘గ్యాంగ్‌ లీడర్‌’పై మెగా అభిమానుల రచ్చ

నేచురల్‌ స్టార్‌ నానికి ఊహించ‌ని షాక్ ఎదురైంది. ఈయ‌న గ్యాంగ్ లీడ‌ర్ టైటిల్ తీసుకుంటే ఫ్యాన్స్ ఆనందంగా ఫీల‌వుతారేమో అనుకున్నారు అంతా. ఎందుకంటే చిరంజీవి మాదిరే ఈయ‌న కూడా సొంతంగా పైకొచ్చాడు క‌దా. కానీ ఇప్పుడు నానికి ఊహించ‌ని షాక్ ఇస్తున్నారు మెగా అభిమానులు. అస‌లు నువ్వు గ్యాంగ్ లీడ‌ర్ ఏంటి అంటూ సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. వెంట‌నే ఈ సినిమాకు టైటిల్ మార్చాలంటూ వాళ్లు ర‌చ్చ చేస్తున్నారు.

తెలుగు ఇండ‌స్ట్రీలో గ్యాంగ్ లీడ‌ర్ అంటే అది ఒక్క చిరంజీవి మాత్ర‌మే అని.. ఆయ‌న్ని కాద‌ని మ‌రెవ‌రూ ఈ టైటిల్ పెట్టుకునే అర్హ‌త లేదంటున్నారు వాళ్లు. నాని మంచి హీరో అయినా కూడా చిరంజీవికి త‌ప్ప మ‌రో హీరోకు గ్యాంగ్ లీడ‌ర్ టైటిల్ వాడుకునే అవ‌కాశ‌మే లేదంటున్నారు వాళ్లు. ఊహించ‌ని ఈ పరిణామంతో నాని కూడా షాక్ అవుతున్నాడు. విక్రమ్ కే కుమార్ ఈ సినిమాను కేవ‌లం ఆర్నెళ్ల‌లోనే పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.

8 ఏళ్ల చిన్న‌ పాప‌.. 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి.. 22 ఏళ్ల క‌త్తి లాంటి అమ్మాయి.. 50 ఏళ్ల అమ్మ వ‌య‌సు ఉన్న మ‌హిళ.. కాటికి కాలు చాపుకున్న బామ్మ‌.. ఈ ఐదుగురు గ్యాంగ్ కు ఓ లీడ‌ర్.. అత‌డే మ‌న గ్యాంగ్ లీడ‌ర్. ఈ ఐదుగురు లైఫ్ సైకిల్ గ్యాంగ్ లీడ‌ర్ క‌థ‌. మ‌రోసారి విక్ర‌మ్ కే కుమార్ త‌న మార్క్ స్క్రీన్ ప్లేతో సిద్ధ‌మైపోయాడు. చిరంజీవి ఆల్ టైమ్ క్లాసిక్ టైటిల్ వాడుకున్న‌పుడే క‌ష్టాలు వ‌స్తాయ‌ని తెలుసు కానీ ఇంత త్వ‌ర‌గా వ‌స్తాయ‌ని మాత్రం నాని ఊహించ‌లేదు. మ‌రి ఇది ఎలా ముగుస్తుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

గ్యాంగ్ లీడ‌ర్ టైటిల్ రిస్క్ అని తెలిసినా కూడా క‌థ‌పై ఉన్న న‌మ్మ‌కంతో దాన్ని తీసుకున్నాడు న్యాచుర‌ల్ స్టార్. ఇందులో నానితో మ‌రో ఐదు కీల‌క‌పాత్ర‌లు ఉంటాయి. వీళ్ల చుట్టూ తిరిగే క‌థ ఈ సినిమా. ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. జెర్సీ త‌ర్వాత మ‌రోసారి నాని సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇదే ఏడాది సినిమా విడుద‌ల కానుంది.