ఎఫ్‌-2 హీరోయిన్‌ మెహ్రీన్‌కు ఆఫర్ల వెల్లువ

ఈ ఏడాది ఆరంభంలో టాలీవుడ్‌ అందుకున్న భారీ విజయం ‘ఎఫ్ 2’. ఇందులో మెహ్రీన్ కౌర్ నటనకు ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. దీంతో మెహ్రీన్‌కు పలు భాషల్లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తెలుగులో ఇప్పటికే గోపీచంద్ సినిమాను ఓకే చేసిన ఆమె తాజాగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సరసన నటించేందుకు ఒప్పుకుందట. ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం కూడా గత చిత్రాల్లానే పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో మెహ్రీన్‌ మంచి ఫెర్ఫార్మెన్స్ ఉన్న పాత్ర లభించనుందట. మరోవైపు తమిళంలో ధనుష్ సరసన మరో సినిమాలో నటించబోతుందట. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుందట. కన్నడ సినిమాలో ప్రముఖ నటుడి సినిమాలో మరో మంచి ఆఫర్ వచ్చిందట. దీంతోపాటు మరికొన్ని ఆఫర్లు క్యూలో ఉన్నాయట.