
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో ‘మైఖేల్’ ఒకటి. రంజిత్ జయకోడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన సందీప్ లుక్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ వచ్చింది.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తుది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ విలన్‌గా నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్‌పి,కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్లపై పుస్కుర్ రామ్‌మోహన్ రావు, భరత్ చౌదరీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్, వరుణ్ సందేష్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.
Been waiting for this for waayy too Long Now 🙂
Welcoming you to the Madness this 20th October..#MichaelTeaser
Amidst All the Chaos..He Found Love ❤️🔥#Michael pic.twitter.com/uRLdxlnQQk
— Sundeep Kishan (@sundeepkishan) October 14, 2022













