HomeTelugu Trendingహీరోయిన్‌ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌

హీరోయిన్‌ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌

Vijay and surya fans angryకోలీవుడ్‌ స్టార్‌ హీరోలు సూపర్‌స్టార్‌ రజినీకాంత్, ఇళయ దళపతి, హీరో సూర్య లపై నటి మీరా మిథున్ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. స్టార్స్ పై మీరా మిధున్ వ్యాఖ్యలు చేయడాన్ని నెటిజన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. సోషల్ మీడియా వేదికిగా ఇప్పటికే ఆమెపై తీవ్ర వ్యాఖ్యల చేస్తూ.. ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో చెన్నైలో విజయ్ మరియు సూర్య ఫ్యాన్స్‌ అంటూ కలామ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మీరా బొమ్మను తగులబెట్టారు. ఆ విషయం అమ్మడి దృష్టికి వెళ్ళింది. కలామ్ పేరుతో ఉన్న ఆర్గనైజేషన్ తో ఇలాంటి పనులు చేయడానికి బుద్ది లేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కనీసం మీరు ఆ పేరును అయినా మార్చుకోండి. కలామ్‌జీ కి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా. ఇలాంటి పనులు చేస్తున్న మీకు ఆయన పేరు వాడుకునే అర్హత లేదు. ఈ ఘటనకు పూర్తిగా విజయ్ మరియు సూర్యలే కారణం అంటూ మీరా మళ్లీ విమర్శలు మొదలు పెట్టింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu