HomeTelugu Big Stories'మైఖేల్‌' ట్రైలర్‌ విడుదల

‘మైఖేల్‌’ ట్రైలర్‌ విడుదల

Michael Official Trailer
టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’. రంజిత్ జైకోడి దర్శకుడు. విజయ్ సేతుపతి వరుణ్ సందేష్ గౌతమ్ మీనన్, అనసూయ, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. దివ్యాంన్ష కౌశిక్ హీరోయిన్ కరణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్ ఎల్ పీ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ లపై భరత్ చౌదరి పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ని తెలుగులో ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేయగా తమిళంలో జయం రవి అనిరుధ్ రవిచంద్రన్ విడుదల చేశారు. మలయాళంలో క్రేజీ హీరో నవీన్ పాలీ రిలీజ్ చేశాడు. టీజర్ తో ఆసక్తిని రేకెత్తించి అంచనాల్ని పెంచేసిన ఈ మూవీ ట్రైలర్ తో కూడా ఆ అంచనాల్ని మరింతగా పెంచేసింది. ప్రతీ సీన్ లోనూ సందీప్ కిషన్ ఈ మూవీ కోసం ప్రాణం పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో ఫిబ్రవరి 3న అత్యంత భారీగా రిలీజ్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!