‘మిస్టర్ మజ్ను’ టైటిల్ సాంగ్ పిక్ వైరల్..!

అక్కినేని యంగ్‌హీరో అఖిల్ మూడో ప్రయత్నంగా ‘మిస్టర్ మజ్ను’ చేస్తున్న సంగతి తెలిసిందే. A అఖిల్, హలో సినిమాలు బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచాయి. తొలిప్రేమ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరితో అఖిల్ మిస్టర్ మజ్ను చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. జనవరి లేదా ఫిబ్రవరి నెలలో ఈ సినిమా విడుదల కాబోతున్నది.

ఈ సినిమా టైటిల్ సాంగ్ కు సంబంధించిన ఫోటోను ఈరోజు విడుదల చేశారు. క్రిస్మస్ సందర్భంగా రేపు సాయంత్రం 6 గంటలకు ఈ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఎస్వీసిసి సినిమా ఈ సినిమా నిర్మిస్తున్నది.