ఆకట్టుకుంటున్న ‘నా కనులు ఎపుడు’ సాంగ్‌ ప్రోమో

టాలీవుడ్ యంగ్‌ హీరో నితిన్-కీర్తిసురేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ త‌న సంగీతం అందిస్తున్నాడు. ఈ క్రమంలో రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కంపోజిషన్ లో యువ సంచలనం సిద్ శ్రీరామ్ ఆలపించిన ”నా కనులు ఎపుడు” అనే గీతాన్ని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ అనౌన్స్ మెంట్ సందర్భంగా సాంగ్ ప్రోమో వీడియో చిత్ర బృందం విడుదల చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు మార్చి 4న సాయంత్రం 4.05 నిమిషాలకు ఈ మనోహరమైన పాట లిరికల్ వీడియోను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాని పీడీవీ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ తెర‌కెక్కిస్తున్నాడు. మార్చి 26న విడుద‌ల కానుంది.

CLICK HERE!! For the aha Latest Updates